మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:5 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మండల శివారు కన్నాల రైతువేదికలో వ్యవసాయశాఖ వారు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తూ, రైతులకు సబ్సిడీ పై మొక్కలు అందిస్తుందని, నాలుగు సంవత్సరాల వరకు నిర్వహన ఖర్చుల కింద నగదు ప్రోత్సాహం అందిస్తుందని, ఎస్సీ,ఎస్టీ రైతులకు 90% రాయితీ ఉందని,బీసీ రైతులకు 80% రాయితీ ఉందని, రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో బెల్లంపల్లి ఏఈఓ సీహెచ్.తిరుపతి, గురజాల ఏఈఓ శ్రీను, మాట్రిక్స్ ఫీల్డ్ ఆఫీసర్ హర్షవర్ధన్, రైతులు పాల్గొన్నారు.