భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపహాడ్
✍️దుర్గా ప్రసాద్

బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్, TS, 28, T, 6744, భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్దిపాలెం సమీపంలో పర్సు పోగొట్టుకున్నాడు.

అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల కు చెందిన పెరిక రోషయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బాధవత్ లలిత, లకు రోడ్డుపై పర్సు పడివుండటం గమనించి దానిలోని సుమారు 16000 రూపాయలు కింద పడి ఉండగా వాటిని తీసుకొచ్చి నిజాయితీ గా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఒప్పజెప్పటం జరిగింది.

పర్సులో ఉన్న కార్డు ఆధారంగా ఎస్ఐ మేడ ప్రసాద్ అతన్ని పిలిపించి ఒప్పచెప్పటం జరిగింది.

నిజాయితీ చాటుకున్న వారిని అభినందించిన బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్…