భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

తీజ్ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయం నృత్యం చేసిన సీతక్క

కొత్తగూడెం టౌన్ చిట్టి రామవరం తండాలో ఆదివారం తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరై బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరమా భవానీలకు ప్రత్యేక పూజలు చేశారు. తీజ్ బుట్టను ఎత్తుకొని కన్నెపిల్లలతో బంజారా సాంప్రదాయ నృత్యం చేశారు. తొమ్మిది రోజులపాటు పెళ్లికాని ఆడపిల్లలు ఎంతో నియమనిష్టలతో చేసే తీజ్ పండుగ గొప్పదని చెప్పారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి ఆచరించడం మనందరి బాధ్యతా అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీజ్ పండుగ జరుపుకుంటున్న బంజారాలకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం 19వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్ణచంద్ర నాయక్ స్వగృహంలో తైవాన్ మామిడి మొక్క నాటారు. స్థానిక ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బానోత్ సాంగు, బానోత్ చందర్, భీమా, చిట్టిబాబు, వాసు, బాలు, రూప్ల, రాందాస్, రమేష్, శ్యామ్, ఖాజా భక్ష్, నాగరాజు, అమన్, సిద్దు, సోహెల్, మున్ను, బన్ను, స్థానిక మహిళలు పాల్గొన్నారు.