భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
ది.04-08-2025
✍️ దుర్గా ప్రసాద్
ఆగస్టు 9న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి…
పాల్వంచ మండలం పాత సూరారం, కోయ గుంపు నందు కొమరం భీం విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి.
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం గ్రామ గ్రామాన జయప్రదం చేయాలని ఆదివాసి సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సోమవారం నాడు పాల్వంచ కొమరం భీం భవన్ నందు జరిగిన సమావేశంలో నేతలు పేర్కొంటూ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని వేడుకలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని ,ప్రభుత్వం ఆదివాసీ హక్కులు చట్టాలపై సమీక్ష చేయాలని ఆగస్టు 9న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్ధిక పాలసీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పాల్వంచ మండలం పాత సూరారం కోయ గుంపు నందు ఆదివాసుల బెబ్బులి కొమురం భీం విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ఈ యొక్క ఆవిష్కరణకు జిల్లాలోని ఆదివాసి ఎమ్మెల్యేలు వివిధ ఆదివాసి సంఘాల బాధ్యులు పాల్గొంటున్నారని, పాల్వంచ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ యొక్క సమావేశంలో ఆదివాసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, ఆదిమ ఆదివాసి సంక్షేమ సంఘం మరియు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోయం సత్యనారాయణ, కోయ గుంపు విగ్రహావిష్కరణ నిర్వహణ కమిటీ సభ్యులు మెస్సు సహదేవులు, తోలేం బాబురావు, సనప నారాయణ జిల్లా మాజీ సర్పంచుల సంఘం నాయకులు పడిగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
