కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను… జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై వాస్తవాలను మన BRS పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు భద్రాద్రి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంది.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించనున్నారు. మన జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు జిల్లా పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మనవి.
మీ
కాపు సీతాలక్ష్మి,
కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్
