భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
పాత సూరారం గ్రామం
✍️దుర్గా ప్రసాద్

పాత సూరారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో విగ్రహాల ఊరేగింపు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు

పాల్వంచ మండలం పరిధిలోని పాత సూరారం గ్రామంలో ఇటీవల ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాలను నిర్మించారు.

ఆదివారం నుండి మంగళవారం వరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. ఆదివారం బొడ్రాయి,ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి విగ్రహాలతో పాటు ఇతర విగ్రహాలను పాత సూరారం గ్రామంలో అట్టహాసంగా ఊరేగించారు. గ్రామంలో హోమం పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలే జానకి రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాపర్తి వెంకటాచారి, నిర్వాహకులు కూరాకుల వెంకన్న, లావుడ్య శ్రీను, బానోత్ లచ్చిరాం, బొల్ల కృష్ణ, జామ్ల,భూక్య బావ్ సింగ్, గుగులోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.