మంచిర్యాల జిల్లా,
తేదీ:4 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం హాజీపూర్ మండలం రాపల్లి, ముల్కళ్ల ప్రభుత్వ పాఠశాలలు, మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి స్కూల్ కిట్లు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉన్నత విద్య తోనే ఉజ్జ్వల భవిషత్తు ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. తమ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామని రఘునాథ్ వెరబెల్లి తెలిపారు.
