మంచిర్యాల జిల్లా,
జైపూర్,
తేదీ:5 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
సరైన అనుమతులు లేకుండా అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై 6ఎ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తెలిపారు.
మంగళవారం తనిఖీలలో భాగంగా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామం పరిధిలోని రొమ్మిపూర్ ఆమ్లెట్ గ్రామంలో సరైన అనుమతులు లేకుండా అక్రమంగా డీజిల్ నిల్వచేసిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డీజిల్ బంక్ పై 6ఎ కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… డీజిల్ బంక్ వారు ఫామ్ – బి అనుమతి లేకుండా అక్రమంగా 8 వేల 141 లీటర్ల డీజిల్ ట్యాంకులలో నిలువ చేశారని, తెలంగాణ పెట్రోలియం ప్రోడక్ట్ 2016 ప్రకారం ఎవరైనా 2 వేల 500 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ నిల్వ చేసుకున్నవారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా డీజిల్ నిల్వ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
