మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: మంచిర్యాల హమాలీ కార్మికుల సంఘం ఎన్నికలు శనివారం విజయవంతంగా పూర్తయ్యాయి. హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి చిట్టవేణి లక్ష్మణ్, షేర్ శంకర్ పోటీపడ్డారు. 103 ఓట్ల మెజారిటీతో చిట్టవేణి లక్ష్మణ్ విజయం సాధించారు. జనరల్ సెక్రటరీ పదవికి బోడకుంట రామచందర్, బియ్యాల శ్రీహరి, సైధం శ్రీను పోటీలో నిలిచారు. 198 ఓట్ల మెజారిటీతో బోడకుంట రామచందర్ గెలుపొందారు.
గెలిచిన అభ్యర్థులు మాట్లాడుతూ… హమాలీ కార్మికుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, గౌరవ అధ్యక్షుడు పూదరి తిరుపతి సహాయ సహకారాలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పూదరి తిరుపతి మాట్లాడుతూ…

హమాలీల కోసం లేబర్ కార్డులు ఇప్పించడం, సంఘ భవనం కోసం స్థల కేటాయింపు,సరైన రేట్ల అమలులో ఎమ్మెల్యే పాత్ర కీలకమని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కొత్త నాయకత్వం మరింత బలంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.