భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ,
06,ఆగష్టు,2025.
✍️దుర్గా ప్రసాద్
స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ — తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి.
స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఉద్యమకారులు కొనియాడారు.తెలంగాణా జాతిపిత, తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు పాల్వంచ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బుధవారం బుడగం నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటే ఆయన జీవిత లక్ష్యం గా ముందుకు సాగారని, తెలంగాణ అస్తిత్వం కోసం జీవితకాలం పని చేసారని గుర్తు చేసుకున్నారు. ఈయన మొట్టమొదట 1952 లోనే ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటం చేసారని,నదిజలాల వాటాల పంపిణీలో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రావాలని కోరుకున్నారని అన్నారు. జయశంకర్ సార్ గొప్ప విద్యావేత్తని, కాకతీయ విశ్వవిద్యాలయం నకు వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహించారని తెలిపారు. ఆయన ఆశయాలు సాధించినపుడే మనం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆయన జీవిత చరిత్రను, త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేసారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రషీద్, బరగడి దేవదానం, నబీ సాహెబ్, రవూఫ్, శ్రీ పాద సత్యనారాయణ, శనగ వెంకటేశ్వర్లు, యస్.డీ.టీ హుస్సేన్, కుడికాల ఆంజనేయులు, గొడ్ల మోహన్ రావు, ఉబ్బన శ్రీను, వీరభద్రం, బాషా, బాబా, శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………..
ఇవి కూడా చదవండి…
- కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
- తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు
- genco లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి…
- BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు BRS పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి
- ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్రం మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు
- గ్రామీణ వికాసం బిజెపితోనే సాధ్యం
- బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
- బాబు ఆర్ట్స్ – మణుగూరులో ఓ లేఖన కళాకారుడి కథ
- ఆదివాసి దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జయప్రదం చేయండి – ఆదివాసీ సంఘాల జెఏసి పిలుపు
