మంచిర్యాల జిల్లా,
దండేపల్లి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసారు.

దండేపల్లి గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. కర్ణపేట గ్రామ పంచాయతీలోని కస్తూర్బా గాంధీ విద్యాలయమును పరిశీలించారు.

అనంతరం లింగాపూర్ గ్రామ పంచాయతీలోని మోడల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. లింగాపురం గ్రామ పంచాయతీలోని పారిశుధ్య కార్యకలాపాలను, నర్సరీని సందర్శించారు. అనంతరం ధర్మరావుపేట గ్రామ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తదుపరి ద్వారకా గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని పరిశీలించారు.