ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: అష్టమి ప.12:40 వరకు
తదుపరి నవమి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: విశాఖ రా.03:24 వరకు
తదుపరి అనూరాధ
యోగం: గండ ప.12:23 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: కౌలువ ప.12:40 వరకు
తదుపరి తైతుల రా.12:55 వరకు
తదుపరి గరజ
వర్జ్యం: ఉ.08:10 – 09:50 వరకు
దుర్ముహూర్తం: ఉ.06:47 – 08:14
రాహు కాలం: ఉ.09:38 – 11:04
గుళిక కాలం: ఉ.06:47 – 08:13
యమ గండం: ప.01:55 – 03:21
అభిజిత్: 12:07 – 12:51
సూర్యోదయం: 06:47
సూర్యాస్తమయం: 06:12
చంద్రోదయం: రా.12:22
చంద్రాస్తమయం: ఉ.11:54
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: తూర్పు
అన్వాష్టక శ్రాద్ధము
శ్రీ గోపాలదాసర పుణ్యతిథి
శ్రీ చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య
కవి పుణ్యతిథి
గుళావణి మహారాజ్ పుణ్యతిథి
తిరునీలకంఠనాయనార్
తిరునక్షత్రం
శ్రీ సత్యాభిజ్ఞతీర్థ పుణ్యతిథి
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రారంభించిన కార్యక్రమాలలో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వరుని సందర్శనం శుభప్రదం.
వృషభం
సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.
మిధునం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం శుభప్రదం.
కర్కాటకం
మిశ్రమ కాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
సింహం
పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య
ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం మంచిది.
తుల
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.
వృశ్చికం
పనులలో విజయం ఉంది. మీ కీర్తి వృద్ధి చెందుతుంది. మీపై బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ధనుస్సు
చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.
మకరం
ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనంతో శుభఫలితాలు పొందుతారు.
కుంభం
మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీలక్ష్మీ ధ్యానం శ్రేయోదాయకం.
మీనం
పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)