మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బీఆర్ఎస్ శ్రేణులు మందమర్రిలో గురువారం ఘనంగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలతో, జెండాలతో బస్ స్టాండ్ ప్రాంత మంతా గులాబీమయం అయింది.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్ఎల్.సి కవి,గాయకులు దేశ పతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

వారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్టుందని వారు అన్నారు.