మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్టును వెంటనే రద్దు చెయ్యాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,నెన్నెల మండలంలోని,కొత్తూరు గ్రామంలో నిర్మించే పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంలో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు, కాంట్రాక్టర్ జలీల్ కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించాలని బీజేపీ నెన్నెల మండల అధ్యక్షుడు శేఖర్,ఇతర నాయకులతో కలిసి కొత్తూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం పనులను పరిశీలించి చూశారు.
పాఠశాల విద్యార్థులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రహారీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 27 లక్షల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. దీని నిర్మాణ పనులను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ కు నిబంధనలకు విరుద్ధంగా నామినేటెడ్ పద్ధతిలో అప్పగించారని అన్నారు.
ఈ పనులను టెండర్లు పిలిచి ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులకు లబ్ది చేకూర్చడానికి నిబంధనలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత లేకుండా నాసిరకంగా మట్టి కలిసి ఉన్న ఇసుక, నాసిరకం సిమెంట్, కంకర కలిపి పనులు చేస్తున్నారని తెలిపారు. బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన అనుచరులకు దోచి పెట్టడానికి ఇలాంటి నాసిరకం పనులు చేస్తున్నారని తెలిపారు.
సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే మీరు మనిషిని పెట్టి చూడాలని బాధ్యత లేకుండా సమాధానం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ జలీల్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఏమాజి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు శైలేందర్ సింగ్ , కూనరప రాజన్న, గుండ్లపెల్లి రాజన్న, మహేందర్, సాగర్, రత్నం అరుణ్, పెరుగు వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- కేర్ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
- అడ్వకేట్ శివారెడ్డి కుమారుడు డాక్టర్ అమరేందర్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- భద్రాచలo డివిజన్ పరిధిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మలేరియా డిపార్ట్మెంట్
- ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, శుభం జరగాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
