మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతము కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది మాతలు పాల్గొని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకొని ఒకరికి ఒకరు వాయినాలు సమర్పించుకున్నారు.
అనంతరం పాఠశాల కార్యదర్శి బాల సంతోష్, మంచిర్యాల విభాగ్ అకాడమిక్ ఇంచార్జ్ పూదరి సత్యనారాయణ, మాతృ భారతి సభ్యులు సుష్మా లాహుటీ, అనిత యాదవ్, సలహా సమితి సభ్యులు నల్మాస్ సంతోష్, నంది సంతోష్,ముత్తె వెంకటేష్, ప్రధానాచార్యులు, ఆచార్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రత విశిష్టత గురించి రాంభట్ల శివకృష్ణ వివరించారు.
ఈ వ్రతం చేయుట ఫలితంగా ” అష్టైశ్వర్యాలు” సిద్ధిస్తాయని ప్రతి సంవత్సరం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో అందరూ మాతృమూర్తులు పాల్గొనాలని వారు కోరారు.
ఇవి కూడా చదవండి…
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
- బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు
- తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..
- నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…
- రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.
