మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది: 08 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బుధవారం అర్థ రాత్రి బాలికల గురుకులమ్ లో చొరబడి బాలికలను భయబ్రాంతులకు గురిచేసిన 4 గురు అగంతుకులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు.

తాళ్ళ గురజాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం…

మహిళా గురుకుల ప్రిన్సిపాల్ బుధవారం రోజు రాత్రి 12 గంటలకు గురుకుల కళాశాల ప్రాంగణం లోకి నలుగురు వ్యక్తులు గోడ దూకి వచ్చారని ఇచ్చిన దరఖాస్తు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోనూరు కిరణ్, దుగుట సంజయ్, కొంజన కిరణ్, గొల్లపల్లి కిరణ్ అను నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి 12 గంటలకు తాగిన మైకం లో కోనూరు కిరణ్, సంజయ్ అను ఇద్దరు కాలేజీ ప్రహరీ గోడ దూకి గోడ పక్కన గల చెట్టు వద్ద నిలబడి ఉండగా, మిగతా వారు గోడ పై నిలబడి ఉండి విద్యార్ధినులను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడగా, వెంటనే అప్రమతమైన వాచ్ ఉమెన్ వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, వాళ్ళు గోడ దూకి పారిపోయారు.

అట్టి నలుగురు వ్యక్తులను శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేసారని తెలిపారు. రాత్రి సమయంలో పోలీస్ గస్తీ పెట్రోలింగ్ ముమ్మరం చేశారని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడిన, రాత్రి సమయం లో అనుమానస్పదంగా ఎవరైనా కనపడినా, అసంగటిత చర్యలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతాయని తాళ్ళ గురజాల ఎస్ఐ హెచ్చరించారు.