మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
దశాబ్దాల కాలం పాటు నివాసముంటున్న ఇంటి స్థలాలను అక్రమంగా పట్టాలు చేసుకుని ఇబ్బందికి గురి చేయడం ఇకనైనా మానుకోవాలని నేతకాని మహర్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు తోపాటు బాధిత గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం రోజు టేకులబస్తీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో పలువురు బాధితులు మాట్లాడుతూ… మాల గురిజాల గ్రామంలోని సర్వే నెంబర్ 162 లో 13 గుంటల భూమిని అనుభవదారుడుగా ఉన్న చాపిడి పోశం వద్ద కొనుగోలు చేసి తాతలు తండ్రుల కాలం నుండి సుమారు ఆరు దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న ఇండ్లను అక్రమంగా కామెర నారాయణ అనే వ్యక్తి కేవలం మూడు గుంటల భూమిని కొనుగోలు చేసి 13 గుంటల భూమికి పట్టాదారుడీగా ఉన్న దుర్గం నానయ్య అనే సుంకరిని సంప్రదించి 13 గుంటల భూమిని 2025 వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ ను అక్రమంగా చేసుకున్నాడని పేర్కొన్నారు.
గ్రామీణులను ఇబ్బంది పెడుతున్న కామెర నారాయణ అదే గ్రామానికి చెందిన గొమాస పోషం వద్ద కేవలం 3 గుంటల భూమిని కొనుగోలు చేసి 13 గుంటల భూమికి పట్టాదారుడిగా ఎలా మారాడని బాధిత గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత విషయమై పలుమార్లు గ్రామంలోనూ పెద్దల సమక్షంలో మాట్లాడినప్పటికీ సంబంధిత వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామీణులు ఇబ్బంది పెడుతున్నాడని, నేడు ఇందిరమ్మ ఇల్లు రావడంతో పాత ఇంటిస్థానంలో నూతన గృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అడ్డుకుంటూ నానా రభస చేస్తున్నాడని పేర్కొన్నారు.
సంబంధిత విషయమై నాటి ఎమ్మెల్యే దుర్గం చిన్న
య్యను సంప్రదించి న్యాయం చేయమని కోరడం జరిగిందని కానీ మాజీఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బంధువు కావడంతో బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. దశాబ్దాల కాలం పాటు నివాసం ఉంటూ ఇంటిపన్ను, కరెంటు బిల్లులను సైతం చెల్లిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, నివాసం ఉంటున్న ఇండ్లు శిథిలావస్థకు చేరిన కారణంగా నూతనగృహాలు నిర్మించుకునేందుకు సమాయత్తం కావడంతో కామెర నారాయణ, అతని కుటుంబీకులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
తమ గ్రామంలో సంబంధిత 13 గుంటల భూమిని అక్రమంగా పట్టాచేసుకున్న విషయం
అందరికీ తెలుసని, కనీసం ఒకరైన తమకు సంబంధించిన భూమి కాదని, అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తి దేనని తెలిపిన పక్షంలో ఊరు వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామీణులు స్పష్టం చేశారు. సంబంధిత విషయమై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో రెవెన్యూ అధికారులు సైతం విచారణ జరిపి సంబంధిత భూమిలో దశాబ్దాల కాలంపాటు నివాసం ఉంటున్న వ్యక్తులను గుర్తించి పంచనామా నిర్వహించడం సైతం జరిగిందని వెల్లడించారు.
సంబంధిత విషయంలో అక్రమంగా పట్టాపొందిన వ్యక్తి చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్న వ్యక్తులు ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధం కావడంతో అక్రమంగా పట్టా పొందిన వ్యక్తి అడ్డుకుంటున్న కారణంగా గ్రామానికి చెందిన గొమాస శ్రీకాంత్ అనే వ్యక్తి బాధితులకు అండగా నిలవడంతో గురువారం రోజున నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుల తో పాటు పలువురు అనవసరమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వాస్తవాలు తెలుసుకొని బాధిత గ్రామీణులకు అండగా నిలబడాల్సిన నాయకులు అక్రమంగా పట్టాపొందిన వ్యక్తి వైపు నిలవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో పాటు అధికార యంత్రాంగం చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేసే చర్యలు తీసుకోవాలని బాథిత గ్రామీణులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎగొలపు రమాదేవి, ఎగొలపు రమేష్,దుర్గం అంకులు, గోమాస తిరుపతి,గొమాస ప్రశాంత్, దుగుట విలాస్, ఎగోలపు రేణుక,డోంగిరి లక్ష్మణ్, కలాలి రామయ్య, దాగం రాజం, గోమాస అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- కేర్ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
- అడ్వకేట్ శివారెడ్డి కుమారుడు డాక్టర్ అమరేందర్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- భద్రాచలo డివిజన్ పరిధిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మలేరియా డిపార్ట్మెంట్
- ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, శుభం జరగాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
