మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ : 08 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాల గురించి, ప్రయాణీకుల రక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజనల్ ఏసీపీ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచనలు చేశారు. ఎవరైనా చట్టపరమైన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ కె.శ్రీనివాస్, ఎస్ఐ.రాకేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.