మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లో అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగునీటిని అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్య లేకుండా అమృత్ 2.0 పథకం ద్వారా త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ పథకం లో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
- బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు
- తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..
- నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…
- రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.
