మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:09 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియా 12వ వార్డు రోడ్ నెంబర్- 7 లో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నటువంటి బొద్దున సతీష్ తండ్రి బోద్దున శంకర్ కుటుంబం ఉంటున్న గూణ పెంకుటిల్లు ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఎటువంటి నిలువ నీడ లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు. వెంటనే పరిస్థితిని తెలుసుకొన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ ఘటన స్థలానికి చేరుకొని ఎమ్మార్వో కృష్ణ కు సమాచారం అందించారు.
అనంతరం స్పందించిన ఎమ్మార్వో మండల ఆఫీస్ నుండి సోమవారం ఆర్ఐ ని పంపించి పంచినామా చేయిస్తామని తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ…, ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నామని, కొన్ని సంవత్సరముల నుండి ఆటో డ్రైవర్ గా జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. కావున ప్రభుత్వం ద్వారా తమపై దయతలచి తగిన నష్టపరిహారం ఇప్పించగలరని కోరారు.ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు కేటాయించగలరని ప్రభుత్వ అధికారులను కోరారు.
ఇవి కూడా చదవండి…
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
- బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు
- తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..
- నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…
- రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.
