మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:09 ఆగస్టు 2025.
✍️ మనోజ్ కుమార్ పాండే.
కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE) పిజి మరియు డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 లో పీజీ లేదా డిగ్రీ చేసేందుకుగాను ఈనెల 11వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ పీజీలో ఎంఏ లో అన్ని సబ్జెక్టులలో, ఎం.కామ్ చదివేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే ఓపెన్ డిగ్రీలో బిఏ, బీకాం, బీఎస్సీ అన్ని కోర్సులలో అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. దూరవిద్య ద్వారా పీజీ లేదా డిగ్రీ చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీజీ చేసేందుకు స్టడీ సెంటర్ కోడ్ నెంబర్-770 ద్వారా, మరియు డిగ్రీ చదివేందుకు స్టడీ సెంటర్ కోడ్ నెంబర్-043 ద్వారా ఆన్లైన్ లో www.sdlceku.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని ప్రింట్ అవుట్ కు సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి 2 సెట్లు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య స్టడీ సెంటర్ లో అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్స్ నింపి అందజేయాలని ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ కోరారు. వివరాలకు 9959269975 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి…
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
- బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు
- తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..
- నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…
- రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.
